Double Dhamaka | మాస్ మహరాజ రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ధమాకా’. 2022లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాని త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. రవితేజతో పాటు శ్రీలీలా కథానాయికగా నటించిన ఈ చిత్రం, యాక్షన్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అయితే ఇదే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ‘ధమాకా’కి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్‌తో చిత్రయూనిట్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌ను కూడా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశం ఉందని, రవితేజతో ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కానుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జతర’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ డైరెక్టర్ భాను భోగవరపు దదర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మస్తున్నాడు.