హరిహరన్, శ్రీలేఖ, సుహానా జంటగా నటిస్తున్న ‘దొరికిందా’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ రెడ్డి, అశ్వద్ధ రాయల్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్యామలాదేవి క్లాప్‌నివ్వగా, నిర్మాత అశోక్‌కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు.
నేటితరం ప్రేమకథా చిత్రమిదని, వినోదప్రధానంగా సాగుతుందని, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షోయబ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాక్.