మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) నేపథ్యంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. దసరా సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న విడుదలకానుంది. నిర్మాత కోటపాడి జే రాజేష్ మాట్లాడుతూ ‘హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా వలలో చిక్కుకున్న డాక్టర్ దాని నుంచి ఎలా బయటపడ్డాడు? మానవ అక్రమ రవాణాపై ఎలాంటి పోరాటం చేశాడన్నదే చిత్ర ఇతివృత్తం’ అని చెప్పారు.