Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. మహాభారత సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. అలానే విష్ణు కూతుర్లు, కొడుకు అవ్రమ్ సైతం ఈ చిత్రంలో కనిపించి అలరించారు. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది సినీ ప్రియులు ప్రభాస్ ఎంట్రీ.. మోహన్ బాబు యాక్టింగ్.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ చివర్లో 20 నిమిషాలు విష్ణు నటన గూస్ బంప్స్ తెప్పించిందని కూడా చెబుతున్నారు.
ఈ సినిమాలో విష్ణుపై ఉన్న సానుభూతి, కథపై ఉన్న నమ్మకం కారణంగా చాలా మంది రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అయితే, ఇండియన్ సినిమాలలో ఇదొక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టులో స్టార్ నటులు వాలంటరీగా పనిచేయడమంటే, ఇది కథపై వారికి ఉన్న నమ్మకానికి, మంచు విష్ణుపై ఉన్న గౌరవానికి నిదర్శనంగా భావించవచ్చు. ఈ చిత్రం, శైవ భక్తి పురాణాల్లో ప్రసిద్ధుడైన కన్నప్ప జీవిత ఆధారంగా రూపొందుతోంది. ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేయడంతో , విజువల్‌గా ఇది గ్రాండ్‌గా కనిపిస్తుంది.
‘కన్నప్ప’లో భాగమైన స్టార్ నటులు చాలా మంది రెమ్యూనరేషన్ తీసుకోలేదన్న వార్తలు ఫిల్మ్ వర్గాల్లో హల్చల్. స్నేహ భావం, కథపై నమ్మకం, విష్ణుపై గౌరవం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం. ఎవరూ డబ్బుల కోసం కాదు… మనసుపెట్టి పని చేస్తున్నారు” అంటూ విష్ణు సినిమా రిలీజ్‌కి ముంఉద వెల్లడించారు. డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. మోహన్ లాల్ ఈ చిత్రానికి ఒక్క రోజు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చారు. అందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. శివుడి పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్.. రూ.6 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుండగా, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ అతిథి పాత్రలలో కనిపించినందుకు ఒక్కొక్కరు కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు అసలు రెమ్యునరేషన్ తీసుకోపోగా, మరి కొందరు మాత్రం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటున్నారు.