ఆదిత్య 369 సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
ఆదిత్య369 | కాలంలో ప్రయాణించే కథతో వస్తున్న సినిమా కాబట్టి కాలయంత్రం అని టైటిల్ పెడతారని అనుకున్నారు. ఇక బాలకృష్ణ హీరో కాబట్టి ఎన్టీఆర్ హిట్ మూవీ యుగపురుషుడు టైటిల్ పెడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు. చివరికి ఆదిత్య 369 టైటిల్‌కి ఫిక్స్ అయ్యారు.

టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో 30 ఏళ్ల క్రితం వచ్చి క్లాసిక్‌గా నిలిచింది ఆదిత్య369. అప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని కథతో సినిమా తీసి ట్రెండ్ సెట్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అయితే ఈ సినిమాకు ముందుగా ఆదిత్య369 అనే టైటిల్ అనుకోలేదంట. ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే దానిపై అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. కాలంలో ప్రయాణించే కథతో వస్తున్న సినిమా కాబట్టి కాలయంత్రం అని టైటిల్ పెడతారని అనుకున్నారు. ఇక బాలకృష్ణ హీరో కాబట్టి ఎన్టీఆర్ హిట్ మూవీ యుగపురుషుడు టైటిల్ పెడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు. చివరికి ఆదిత్య 369 టైటిల్‌కి ఫిక్స్ అయ్యారు.
కాలంతో పయనించే సూర్యుడికి మరోపేరు ఆదిత్యుడు. ఈ కథలో టైం మెషిన్ కూడా కాలాల్లో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ మెషిన్‌కు ఆదిత్య అని పేరు అనుకున్నారు. ఇక మెషిన్‌కు ఒక నంబర్ ఉండాలని కాబట్టి గడియారంలో ఉండే 3, 6, 9 అంకెలను నంబర్‌గా అనుకున్నారు. అలా ఆదిత్య 369 అనే టైటిల్‌ను అనుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను 110 రోజుల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమాను గ్రాఫిక్స్ కోసం లండన్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమా పూర్తికావడానికి అప్పట్లో రూ.1.60కోట్లు ఖర్చయింది. మొత్తానికి 1991 జూలై 18న విడుదలైన ఆదిత్య 369 సినిమా చిన్నా పెద్దా అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ సీక్వెల్‌కు ఆదిత్య999 అనే టైటిల్ అనుకున్నట్లు కూడా సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. తన వారసుడు మోక్షజ్ఞను ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పటికీ ఇంకా దీనిపై క్లారిటీ లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇండియాలోనే తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య369 : కథ చెప్పగానే బాలకృష్ణ రియాక్షన్ ఏంటి?
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
సీక్రెట్ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
అమ్మ కోసం ఇన్ఫోసిస్‌లో జాబ్ తెచ్చుకున్నా.. నా కోసం సినిమాల్లోకి వచ్చా : అనన్య నాగళ్ల
పీలగా కనిపిస్తున్న రకుల్.. సెటైర్స్ వేస్తున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

