Meher Ramesh | చిరంజీవి సినిమాకు మెహర్ రమేశ్ పారితోషికం ఎంతో తెలుసా..?
మెహర్ రమేశ్ ( meher ramesh ) దర్శకుడిగా సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. ఈయన దర్శకత్వంలో చివరగా షాడో 2013లో వచ్చింది. ఆ సినిమా తర్వాత మెహర్ రమేశ్ పూర్తిగా ఖాళీ అయిపోయాడు.

Vedalam Remake | మెహర్ రమేశ్ ( meher ramesh ) దర్శకుడిగా సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. ఈయన దర్శకత్వంలో చివరగా షాడో 2013లో వచ్చింది. ఆ సినిమా తర్వాత మెహర్ రమేశ్ పూర్తిగా ఖాళీ అయిపోయాడు. అంతకుముందు ఆయనతో సినిమా అనే ఆలోచనలను షాడో చూసిన తర్వాత పూర్తిగా తుడిచేశారు హీరోలు. నిర్మాతలు అయితే మెహర్ వైపు వెళ్లడం కూడా మానేశారు. మధ్యలో రవితేజతో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.. కానీ ఈయన రిస్క్ తీసుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తాడన్నారు కానీ కుదర్లేదు. అయితే ఏడేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు రమేశ్. తమిళనాట సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను మెహర్ రమేశ్‌కు అప్పగించాడు చిరు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలై చాలా రోజులైపోయింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాడు. అజిత్ కెరీర్లో మాస్ హిట్‌గా నిలిచిన వేదాళంపై చిరు మనసు పడ్డాడు. ముందు ఈ చిత్రాన్ని పవన్‌తో రీమేక్ చేయాలనుకుని.. ఏఎం రత్నం ముహూర్తం కూడా పెట్టాడు. నీసన్ దర్శకత్వంలో ఈ రీమేక్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఇప్పుడు చిరంజీవి చేతికి వచ్చింది వేదాళం రీమేక్. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే మెహర్ రమేశ్‌కు ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం మెహర్ పారితోషికం తీసుకోవడం లేదు. ఇది నిజమే.. కాకపోతే నెలకు 5 లక్షలు జీతం అందుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమా మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు ప్రీ ప్రొడక్షన్ కూడా లెక్క పెట్టుకుని.. ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు 5 లక్షలు జీతానికి పని చేస్తున్నాడు మెహర్.
ఇప్పటికే ఈ చిత్ర వర్క్ మొదలై ఏడాది దాటిపోయింది. అంటే ఈ పాటికి మెహర్ ఖాతాలో 60 లక్షలు వచ్చాయి. సినిమా పూర్తి కావడానికి మరో ఏడాది పట్టనుంది. అంటే మరో 60 లక్షలు వస్తాయి. అంటే సినిమా కోసం కోటి 20 లక్షలు తీసుకుంటున్నాడు.. పైగా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే రెండు కోట్లకు అటూ ఇటూగా పారితోషికం అందుకుంటున్నాడు మెహర్ రమేశ్. ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. తన రెమ్యునరేషన్ కాకుండా 25 కోట్లలోపే వేదాళం రీమేక్ పూర్తి చేయాలని మెహర్‌కు చిరు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే టెక్నీషియన్స్ కూడా చిన్న వాళ్లే పని చేస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాంతో పాటు మిగిలిన వాళ్లు కూడా చిన్న టెక్నీషియన్స్ ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!
క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
కూతురితో కలిసి సురేఖా వాణి రచ్చ మాములుగా లేదు-వీడియో
Bigg boss 5 |యాంకర్ రవి బిగ్ బాస్ ఎంట్రీపై నోరు జారిన లాస్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

