సోషల్ మీడియా లో కేవలం పోస్టులు పెట్టడమే కాదు..తాను పెట్టే పోస్టులు ఫాలోవర్లలో ఎంతో కొంత స్పూర్తిని కలిగించేలా ఉండాలని కోరుకుంటుంది సమంత (Samantha). పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది సామ్. ఈ బ్యూటీ మంచి ఫిట్నెస్ లవర్ అని తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక టఫ్ ఫిట్ నెస్ టాస్క్ తో నెటిజన్ల ముందుకొచ్చి అందరూ స్టన్ అయ్యే వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈ భామలో కొత్త యాంగిల్ కూడా ఉందండోయ్. సామ్ మంచి బుక్ లవర్ కూడా (Bookworm).
తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన స్టిల్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ (Will Smith) రాసిన విల్ (Will) బుక్ కవర్ పేజీని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సమంతా ‘విల్’ పై నుంచి గ్రహించిన కొన్ని విషయాలను తన వ్యక్తిగత జీవితంలో పడుతున్న పోరాటానికి లింకప్ చేస్తూ పాపులర్ బుక్‌లో నుంచి ఓ కొటేషన్ ను పోస్ట్ చేసింది. మనందరి లాగే గత 30 ఏళ్లుగా నేను ఫెయిల్యూర్, నష్టం, విడాకులు, మరణం, అవమానాలను ఎదుర్కొన్నా.
‘నాకు ప్రాణహాని ఉంది…నా డబ్బు పోయింది…నా గోప్యత (privacy) హరించబడ్డది. నా కుటుంబం విచ్ఛిన్నమైంది ప్రతీ రోజూ కాంక్రీట్ కలపండి..ఇటుక వేయండి..దాని ముందు వేసేందుకు మరో ఇటుక సిద్దంగా ఉంటుంది. ఒక్కటే ప్రశ్న, మీరు లేచి ఇటుక వేయబోతున్నారా?’. ‘…అంటూ బుక్‌లోని లైన్స్ ను ఉదహరించింది. ఎదురుదెబ్బల నుండి తిరిగి నేర్చుకోండి…మిమ్మల్ని మీరు ప్రతిబింబించుకోండి.. మిమ్మల్ని మీరు మళ్లీ ఆవిష్కరించుకోండి..ఎప్పుడూ వదులుకోవద్దు. మీకు హాస్యం సాయపడుతుంది. అందరిలో స్పూర్తి నింపేలా సమంత పెట్టిన పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.