టాలీవుడ్ (Telugu film industry)లో నిర్మాతలకు మినిమం గ్యారంటీ హిట్ సినిమాలిచ్చే హీరో ఎవరన్నా ఉన్నారా..అంటే ? ఠక్కున గుర్తొచ్చే పేరు వెంకటేశ్ (Venkatesh). ఈ క్రేజీ యాక్టర్ సినిమా వస్తుందంటే చాలు కుటుంబసమేతంగా థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌తో అభిమానులు, మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేయడం వెంకీకి వెన్నతో పెట్టిన విద్య అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఎఫ్ 3 (F3) సినిమాతో మూడు రెట్ల వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు.
మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రానికి వెంకటేశ్ తీసుకున్న రెమ్యునరేషన్ (Remuneration) అంశం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వెంకీ ఈ ప్రాజెక్టుకు రూ.15 కోట్లు పారితోషికం తీసుకున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ క్రేజీ న్యూస్ అఫీషియల్ కాకున్నా..వెంకీ రేంజ్‌కు ఆ మాత్రం రెమ్యునరేషన్ ఉండటం సహజమే అంటున్నారు సినీ జనాలు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్3లో రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, సునీల్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ, ప్రగతి, సోనాల్ చౌహాన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు.