సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలోని ఓ పాటను గురువారం విడుదల చేశారు. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాల్ని సమకూర్చారు. ‘లాలాగూడా అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట…టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల..’ అంటూ సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. ఆయన మాట్లాడుతూ ‘పక్కా హైదరాబాదీ రిథంతో ఉన్న ట్యూన్ కావడంతో మంచి సాహిత్యం కుదిరింది. హీరో పాత్ర చిత్రణను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగుతుంది’ అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నదని, ఈ నెల14న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడి, మాటలు: సిద్ధు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల.