Divyanka Siroh | 29 ఏళ్లకే కన్నుమూసిన నటి దివ్యాంక సిరోహి .. ఆకస్మిక మృతితో షాక్‌లో చిత్ర పరిశ్రమ
Divyanka Siroh | ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి 29 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డిగ్రీ పూర్తి చేసిన దివ్యాంక సిరోహి ప్రస్తుతం ఘజియాబాద్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. చిన్న స్థాయి నుండి కెరీర్ ప్రారంభించిన ఆమె, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రాంతాల్లో లోకల్ భాషల మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Divyanka Siroh | ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ నటి దివ్యాంక సిరోహి 29 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డిగ్రీ పూర్తి చేసిన దివ్యాంక సిరోహి ప్రస్తుతం ఘజియాబాద్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. చిన్న స్థాయి నుండి కెరీర్ ప్రారంభించిన ఆమె, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రాంతాల్లో లోకల్ భాషల మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 50కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించిన ఆమె, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, హీరోయిన్గా ఎదగాలని కృషి చేస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. తరచూ తన ఫోటోలు, వీడియోలతో అభిమానులతో టచ్‌లో ఉండేది.
ఏప్రిల్ 21 మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందుకుంటూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దివ్యాంక సిరోహి మరణం ఉత్తరప్రదేశ్, హర్యానా సంగీత పరిశ్రమలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. యువ ప్రతిభావంతురాలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.
బాలీవుడ్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటున్న సమయంలోనే ఆమె ప్రయాణం ముగియడం నిజంగా విషాదకరం. నిన్న మధ్యాహ్నం ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, భారీగా అభిమానులు హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. దివ్యాంక సిరోహి ఇలా చిన్న వయస్సులో మృతి చెందడం ఆమె కుటుంబానికి, అభిమానులకు ఇది తీరని లోటుగా మిగిలిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

