Shameer Muhammed – Game Changer | ప్రముఖ మలయాళ ఎడిటర్ షమీర్ మహ్మద్ దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేసిన అనుభవంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఎడిటింగ్ సమయంలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు.
షమీర్ మహ్మద్ మాట్లాడుతూ.. తొలుత ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిడివి దాదాపు ఏడున్నర గంటలు ఉందని, దాన్ని తాను మూడు గంటలకు కుదించినట్లు వెల్లడించారు. అయితే, శంకర్ యొక్క అనాలోచిత విధానాలు, జాప్యం, అనవసర జోక్యం కారణంగా తాను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సినిమా నిర్మాణంలో శంకర్ అనుసరించిన పద్ధతులు తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయని షమీర్ మహ్మద్ వ్యాఖ్యానించారు. షమీర్ మహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా శంకర్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టార్‌ను అందుకుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో మెగా అభిమానులు భారీ నమ్మకం పెట్టుకున్నారు. అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో భారీ నష్టాన్ని చవి చూసింది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రాగా దాదాపు రూ.150 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.
Horrible experience while working with Shankar sir – Editor Shameer Muhammed
When he was editing #GameChanger, the length of the movie was about 7 and half hrs and he sorted it into 3 hrs. Later he left the movie due to an unplanned approach, delay and incorporation of Shankar. pic.twitter.com/YSaiDM9ini
— Kerala Trends (@KeralaTrends2) May 23, 2025