Bro Movie Latest Update | నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని వినోదయ సిత్తం రీమేక్‌పై ఇప్పుడు ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూడు రోజుల క్రితం విడుదలైన మోషన్ పోస్టర్‌తో తిరుగులేని హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్‌లుక్ పోస్టరే ఈ రేంజ్లో దింపితే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మేకర్స్ ఓ క్రేజీ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం థమన్ అదే పనిలో ఉన్నాడట. ఈ పాట కోసం బాలీవుడ్ భామ దిశాపటానీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరో ఆప్షన్‌గా శృతిహాసన్‌ను కూడా పరిశీలనలో ఉంచారట. ఇక ఈ పాట కోసం మేకర్స్ బాగానే ఖర్చు పెడుతున్నట్లు టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్డూడీయోస్లో ఓ కాస్ట్లీ పబ్ సెట్‌ను నిర్మిస్తున్నారట. మరీ ఆ ఐటెం పాట పబ్‌లోనే ఉంటుందా లేదంటే స్పెషల్‌గా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.