న్యూఢిల్లీ: దిశా పటానీ హీటెక్కిస్తోంది. హాట్ హాట్ బికినీ డ్రెస్సులో సెగలు చిమ్ముతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే దిశా ఇప్పుడు తన కొత్త పోస్టుతో మరింత రెచ్చిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త బికినీ ఫోటోను అప్లోడ్ చేసిందీ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఆ ఫోటోకు తెగ లైక్‌లు వచ్చిపడుతున్నాయి. కెల్విన్ క్లిన్ ఇన్నిర్వియర్ను ప్రమోట్ చేస్తూ ఆ ఫోటోను పోస్టు చేసిందామె. ప్రింటెడ్లో ఉన్న ఆ సీకే బికినీలో దిశా పటానీ దుమ్మురేపుతోంది.
కొత్త ఫోటోతో దిశా అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. ట్రైనింగ్, వర్కౌట్ ఫోటోలు, వీడియోలతో అలరించే దిశా.. తన తాజా పోస్టుతో టెంపరేచర్ పెంచేసింది. దిశా మాజీ భాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్ తల్లి అయేషా ష్రాఫ్ ఆ ఫోటోకు కామెంట్ చేసింది. టైగర్ ష్రాఫ్ చెల్లలు కృష్ణ ష్రాఫ్ కూడా కామెంట్ విసిరింది.
బికినీ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ఫోటోకు ఇప్పటికే 1,711,183 లైక్‌లు వచ్చాయి. దిశా పటానీకి ఇన్‌స్టాలో 56 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ అనే వ్యక్తితో దిశా కొత్తగా డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఇటీవల ఓ హోటల్లో కనిపించారు.