‘చిన్నతనం నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి…అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య నడిచే వినూత్న ప్రేమకథా చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు” అని అన్నారు దర్శకుడు వై.యుగంధర్. ఆయన నిర్దేశకత్వంలో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. పరిశ్రమలో తొలుత సహాయ దర్శకుడిగా, ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. రొమాంటిక్ కామెడీ కథాంశమిది. ఏ సమయంలో చేయాల్సిన పనిని అప్పుడు చేస్తేనే జీవితం సరైన మార్గంలో వెళ్తుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. కథానుగుణంగానే టైటిల్‌ను నిర్ణయించాం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఓ సున్నితమైన అంశాన్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా సాగుతుంది.
టీజర్ వివాదం ముగిసింది
అందరు అనుకుంటున్నట్లుగా సినిమా అంతా బోల్డ్‌గా ఉండదు. ఓ సీక్వెన్స్‌ను మాత్రం అలా డిజైన్ చేశాం. టీజర్ విడుదల సమయంలో వచ్చిన వివాదాలన్నీ సమసిపోయాయని భావిస్తున్నా. అనుకోని పొరపాటు వల్ల టీజర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజన్‌గా పనిచేసిన అనుభవం దర్శకత్వం విషయంలో బాగా ఉపయోగపడింది. హీరోహీరోయిన్లు కొత్తవాైళ్లెనా చక్కటి నటనను కనబరిచారు. ప్రస్తుతం నా దగ్గర ఆరు విభిన్న జోనర్స్ కథలు సిద్ధంగా ఉన్నాయి.