బాయ్‌కాట్ ట్రెండ్‌ను బాలీవుడ్ ముక్తకంఠంతో ఖండిస్తుంటే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమాలు మాకొద్దు అనే పిలుపునివ్వడం సరైనదే అన్నారు. దీని వైల్లెనా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాలం చెల్లిన ఫార్ములాలతో సినిమాలు రూ పొందిస్తుండటం వల్లే బాలీవుడ్ చిత్రా లు అపజయాల పాలవుతున్నాయని చెప్పారు. ఆయన మాట్లాడు తూ…‘సినిమా అంటే ఫార్ములా, ప్యాకేజీ అని మన దర్శకులు భావిస్తున్నారు.
పాత కథలనే మార్చి జనాల మీదకు వదులుతున్నారు. అందుకే ప్రేక్షకులు విసిగిపోయి ఇలాంటి బాయ్‌కాట్ ట్రెండ్స్ తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో ఇది పాజిటివ్ ఫలితాన్నే ఇస్తుందని నమ్ముతున్నా. నేను ఎవరి ప్రచారం కోసమో సినిమాలు తెరకెక్కించడం లేదు. అలా ప్రాపగండా సినిమాలు రూపొందించినా ఆదరణ పొందవు’ అన్నారు.