Vetrimaran | వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కించడంలో వెట్రిమారన్ దిట్ట. తమిళంలోని స్టార్ డైరెక్టర్లలో ఈయన ఒకడు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. భాషతో సంబంధంలేకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమాను ఆదరించారు.బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో అసురన్ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఇందులో నటించిన ధనుష్‌కు కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. ప్రస్తుతం ఈయన విడుతలై అనే క్రైమ్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. కమేడియన్ సూరీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్‌వాసుదేవమీనన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వెట్రిమారన్ తను కలలు కన్న బైక్‌ను సొంతం చేసుకున్నాడు.
లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకు చెందిన కాస్ట్లీ బైక్‌ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఈ బైక్ ధర 18లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ బైక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుతలై చిత్రం తర్వాత వరుసగా సూర్యతో వడివసాల్ చిత్రాన్ని, విజయ్ 68వ సినిమాలను తెరకెక్కించనున్నాడు. వీటితో పాటుగా సీనియర్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్‌హాసన్ తో కూడా సినిమాలను చేయాలని ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.
Vetrimaaran's new bmw bike!🔥😍#Vetrimaaran @VetriMaaran#NaaneVaruven #Vaathi @dhanushkraja
— Sullan Siva (@SullanSiva1) February 13, 2022