Nandamuri Balakrishna | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆదిత్య 369 (Aditya 369) ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అలరించారు.
అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 04 రీ రీలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో స్పెషల్ పోస్ట్ పెట్టాడు విశ్వంభర దర్శకుడు వశిష్ట.
ఆయన మాట్లాడుతూ.. బింబిసార సినిమాను తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన చిత్రం ఆదిత్య 369. నాకు ఇష్టమైన నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ, లెజెండరీ సింగీతం శ్రీనివాస రావు గారి టైమ్ ట్రావెల్ మాస్టర్‌పీస్ ఆదిత్య 369 ఏప్రిల్ 4న మళ్లీ విడుదల కాబోతుంది.! మీ అభిమాన థియేటర్లలో చూడండి, మిస్ అవ్వకండి! 4K క్వాలిటీలో రీస్టోర్ చేసినందుకు నిర్మాత కృష్ణ శివలెంక గారికి ధన్యవాదాలు! అంటూ వశిష్ట రాసుకోచ్చాడు.
ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహిని హీరోయిన్గా నటించగా, అమ్రిష్ పూరి, టినూ ఆనంద్, నటుడు తరుణ్ సుత్తివేలు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.
#Aditya369 has always been an inspiration for me in making my debut film #Bimbisara.
This ahead-of-its-time time-travel masterpiece by my favourite Natasimham #NandamuriBalakrishna garu and legendary #SingeetamSrinivasaRao garu is re-releasing on April 4th!
Watch it at… pic.twitter.com/GRxNIwC517
— Vassishta (@DirVassishta) April 3, 2025