‘12ఏళ్ల క్రితం యష్‌తో ఓ సినిమా చేశాను. ఆ తర్వాత ఆయనతోనే జర్నీ కంటిన్యూ చేశా. మళ్లీ డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు హీరో శ్రీమురళి నాతో పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. మా
దగ్గర కథలేదు. అలాంటి టైమ్‌లో ప్రశాంత్‌నీల్ తన కథను మాకిచ్చారు. స్క్రిప్ట్ వర్క్‌కి రెండేళ్లు పట్టింది. రియల్ లైఫ్‌లో సూపర్‌హీరో అవ్వాలనుకునే ఓ కుర్రాడి ప్రయాణమే ఈ సినిమా. ఈ
ప్రయాణంలో తను సొసైటీకి మంచి చేశాడా? చెడు చేశాడా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.’ అన్నారు దర్శకుడు డాక్టర్ సూరి. ఆయన దర్శకత్వంలో కన్నడ హీరో శ్రీమురళి కథానాయకుడిగా
రూపొందిన చిత్రం ‘బఘీర’. రుక్మిణి వసంత్ కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ కథ అందించారు.
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ సూరి శనివారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఎమోషన్స్‌తో కూడుకున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ఇది. లార్జర్ దేన్ లైఫ్ తరహాలో ఇందులో హీరో పాత్ర ఉంటుంది. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రశాంత్‌నీల్ సినిమా చూసి అభినందించారు. ఆయన అభినందన వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. ఈ కథలో ప్రాధాన్యత లేని పాత్ర ఉండదు. అజనీస్ లోక్‌నాథ్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇది’ అని తెలిపారు.