Director Sheraz Mehdi | టాలీవుడ్ పెద్దలకు షిరాజ్ మెహది లీగల్ నోటీసులు.. చిన్న సినిమాల కోసమే ఈ న్యాయపోరాటం!
Sheraz Mehdi | టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయం, నెపోటిజం, గుత్తాధిపత్య ధోరణులపై 'ఓ అందాల రాక్షసి' నటుడు, దర్శకుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి దిగారు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయం, నెపోటిజం, గుత్తాధిపత్య ధోరణులపై ‘ఓ అందాల రాక్షసి’ నటుడు, దర్శకుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి దిగారు. తన సినిమాను ప్రేక్షకుల ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆయన ఏకంగా సినీ పెద్దలు, ప్రముఖ నిర్మాతలకు వ్యతిరేకంగా న్యాయపోరాటాన్ని తీవ్రతరం చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్లు నాగవంశీ, భరత్ భూషణ్, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ ప్రసన్న కుమార్లతో పాటు, మల్టీప్లెక్స్ దిగ్గజాలు PVR INOX ప్రతినిధులు అజయ్ బిజిలీ, మేనేజర్ మహేష్, ఏషియన్ సినిమాస్ ఎండీ సునీల్ నారంగ్, మేనేజర్ ప్రశాంత్లకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపినట్లు షిరాజ్ మెహది స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పరిశ్రమలో ప్రతి వంద సినిమాల్లో కేవలం రెండు మూడు చిత్రాలను మాత్రమే పెద్ద సినిమాలని, హిట్ సినిమాలని ప్రొజెక్ట్ చేసి మిగతా 97 సినిమాలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారని షిరాజ్ మెహది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల కనుసన్నల్లోనే థియేటర్లు, ప్రచార వేదికలు, బిజినెస్ నెట్వర్క్ నడుస్తున్నాయని, దీనివల్ల చిన్న సినిమాలు ప్రేక్షకుల కంటపడే అవకాశమే లేకుండా పోతోందని మండిపడ్డారు. చిన్న సినిమాలు మనుగడ సాగించాలంటే కేవలం పెద్దల దయపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ బిజినెస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి చిన్న సినిమాకు ప్రత్యేకంగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, ఒక శాటిలైట్ ఛానల్ అందుబాటులో ఉండేలా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చొరవ తీసుకోవాలని కోరారు. ఇతర భాషల్లో ఉన్న మాదిరిగానే చిన్న సినిమాలకు ప్రభుత్వ సబ్సిడీలు, విక్రయ అవకాశాలు కల్పించేలా ఒక శాశ్వత విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
తమ చిత్రమైన ‘ఓ అందాల రాక్షసి’కి హైదరాబాద్ నగరంలో కేవలం రెండు మూడు షోలు మాత్రమే కేటాయించి, కనీసం ఆ సినిమా బాగుందా లేదా అని ప్రేక్షకులు నిర్ణయించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బతీశారని వాపోయారు. గత ఏడాది కాలంగా తాము అనేకసార్లు ప్రెస్మీట్లు పెట్టి మొరపెట్టుకుంటున్నా, నోటీసులు పంపుతున్నా ఇండస్ట్రీ పెద్దల నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డబ్బు, హోదా, పలుకుబడి ఇచ్చిన అహంకారంతో కొందరు చట్టానికి, కోర్టులకు అతీతులమనే భ్రమలో ఉన్నారని, ఎవరి వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని నిలదీశారు. తాను వ్యక్తిగత కక్షతో ఈ పోరాటం చేయడం లేదని, భవిష్యత్తులో వచ్చే కొత్త దర్శకులు, నటులు, చిన్న నిర్మాతలు ఇదే నరకాన్ని అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ తెగింపు చేశానని స్పష్టం చేశారు. తన సినిమాకు న్యాయం జరిగే వరకు, చిన్న సినిమాలకు ఒక వ్యవస్థ ఏర్పడే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఈ పోరాటంలో మీడియా మిత్రులు తనకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

