Animal Park | ‘యానిమల్’ సీక్వెల్ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్ మూవీ బజార్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమాలోని శృంగారం, క్రూరత్వంపై విమర్శకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘యానిమల్’కు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ పేరుతో మరో చిత్రం రాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ సీక్వెల్ నిర్మాణానికి సంబంధించిన తాజా వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నది.
ఈ ఫిబ్రవరిలోనే సీక్వెల్.. రచన దశకు వెళ్తుందని సందీప్‌రెడ్డి వంగా సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘యానిమల్ పార్క్’ నిర్మాత భూషణ్ కుమార్ ప్రస్తుతం హీరో ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రీకరణ పనులను కొద్ది నెలల్లో ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డైరెక్టర్ సందీప్ ఇచ్చిన ప్లాట్‌లైన్ ఆధారంగా ప్రస్తుతానికి సమయం వృథా కాకుండా సీక్వెల్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిలో రైటింగ్ టీమ్ నిమగ్నం కానున్నది.