RGV Ongole Police Station | దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. వ్యూహం (Vyooham) సినిమా సమయంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినందుకుగాను ఆర్జీవీపై ఒంగోలు పీఎస్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పీఎస్ ముందు హాజరయ్యాడు వర్మ. ఒంగోలు సీఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీ ప్రస్తుతం వర్మను విచారిస్తునట్లు సమాచారం. ఈ విచారణలో దాదాపు 50 ప్రశ్నలు శ్రీకాంత్ బాబు అడుగనున్నట్లు సమాచారం.
2024 నవంబర్ 10న మద్దిపాడు పీఎస్లో వర్మపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికు ముందస్తు బెయిల్ కూడా లభించింది. అయితే బెయిల్ ఇచ్చిన క్రమంలో వర్మకు పలు షరతులను పెట్టింది హైకోర్టు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో విచారణ నిమిత్తం నేడు ఒంగోల్ పీఎస్ ముందు వర్మ హాజరయ్యాడు.