టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లేఖ..

RaghavendraRao | ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమా పరిస్థితులు చూసి ప్రముఖులు స్పందిస్తున్నారు. అక్కడ టికెట్ రేట్లపై జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ససేమిరా నచ్చడం లేదు. అయినా కూడా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు చిరంజీవి లాంటి పెద్దలు మాత్రం ముందుకొచ్చి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా జగన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన అనుభవంతో చెబుతున్నాను సినిమా ఇండస్ట్రీతో ఆడుకోవద్దు అంటూ ఆయన హితవు పలికారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం..
’45 సంవత్సరాల ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మనం ఎప్పుడూ మూలాల్ని మరచిపోకూడదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నా నిర్మాతలు. వీళ్లందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రస్తుతం టికెట్లు షోస్ నిర్ణయంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారు. కామన్ మ్యాన్ కి ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే. ఒక గొప్ప అద్భుతమైన సినిమా కానీ.. సరదా సినిమా కానీ.. హృదయానికి హత్తుకునే సినిమా గాని థియేటర్లలో డాల్బీ అట్మాస్ సౌండ్ మధ్య చూసిన ఫీలింగ్ ఇంట్లో టీవీలో చూస్తే రాదు. షోస్ తగ్గించడం వల్ల, టికెట్ రేటు తగ్గించడం వల్ల పైన చెప్పిన వాళ్లు అందరూ నష్టపోతారు. ఒక హిట్ సినిమా రావడం వల్ల వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకుంటే తర్వాత ఒక యావరేజ్ సినిమా వచ్చినా కూడా వాళ్లకు నెలకు సరిపడా ఆదాయం వస్తుంది. ఎందుకంటే 100 సినిమాలో కనీసం పది శాతం కూడా హిట్స్ ఉండవు. మిగిలిన 10 శాతం యావరేజ్. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్ లైన్ వల్ల దోపిడి ఆగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే టికెట్ రేట్ 300 కాదు 500 పెట్టి చూస్తాడు. అదే సినిమా నచ్చకపోతే ఒక రూపాయికి చూడమన్నా చూడడు. పైగా ఆన్లైన్లో చాలామంది ఇన్ఫ్ల్యూయెన్స్ ఉన్నవాళ్లు టికెట్స్ బ్లాక్ చేసుకొని తర్వాత వాటిని బ్లాక్ దందాలో అమ్ముకోవచ్చు. అదే రేటు ఆన్లైన్లో అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం న్యాయం చేయాలని ఆశిస్తున్నాను..’ అని రాసుకొచ్చారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
టికెట్ రేట్లు పెంచుకోండి.. థియేటర్స్ యాజమాన్యానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Akhanda Benefit shows | అఖండ బెనిఫిట్ షోకు గ్నీన్ సిగ్నల్..ఈ రెండు థియేటర్లలోనే..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

