Kerub Trailer | కెరూబ్ సినిమా ట్రైలర్ విడుదల.. గత, వర్తమాన, భవిష్యత్తుల సమ్మేళనంగా సరికొత్త దృశ్యకావ్యం!
Kerub Movie | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవకే చెందేలా తెరకెక్కిన చిత్రం "కెరూబ్". ఖుషీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎం.జె. నాయుడు దర్శకత్వంలో విహాన్ కార్తీక్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవకే చెందేలా తెరకెక్కిన చిత్రం “కెరూబ్”. ఖుషీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎం.జె. నాయుడు దర్శకత్వంలో విహాన్ కార్తీక్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. “గత, వర్తమాన, భవిష్యత్తు” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
కథలోని సారాంశం అంతా ఒక్క టైటిల్లోనే ఇమిడిపోవాలనే ఉద్దేశంతో అరామిక్ భాష నుంచి “కెరూబ్” అనే పదాన్ని ఎంచుకున్నట్లు దర్శకుడు ఎం.జె. నాయుడు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు పడిన శ్రమ, కుటుంబసభ్యుల సహకారంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. సుమారు పదహారు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. తెలంగాణ అడవుల నేపథ్యంలో సాగే అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని, ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమాను అందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లను చూస్తుంటే మన దేశపు అడవుల్లో తెరకెక్కించిన “అవతార్” సినిమాను తలపిస్తున్నాయని ప్రశంసించారు. మన తెలంగాణలో ఇంతటి అందమైన అడవులు ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగిందని, ఈ చిత్రం మరో “రామాయణం”లా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో విహాన్ కార్తీక్ చూడటానికి విజయ్ దేవరకొండ, నానిలా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడని, భవిష్యత్తులో అతనికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ఎం.జె. నాయుడులో ఉన్న అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు.
హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. మొదట ఒక తెలుగు చిత్రంలో విలన్ పాత్రలో నటించిన తనకు, ఈ సినిమాలో నటించే అద్భుత అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్త నటుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకుడు తనను ఎంచుకున్నారని, ఆయనతో దాదాపు ఏడేళ్లుగా ప్రయాణం సాగుతోందని వెల్లడించారు. ఆర్ట్ డైరెక్టర్ అందించిన అద్భుతమైన లొకేషన్ సెట్టింగ్‌లు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పారు.
సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ మాట్లాడుతూ, హీరో విహాన్ కార్తీక్ ద్వారా తాను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం మూడు పాటలు ఉన్నాయని, చక్కటి సాహిత్యంతో కూడిన ఈ పాటలకు సంగీతం అందించడం ఒక మంచి అనుభూతని పేర్కొన్నారు. దర్శకుడు పడిన తపన తమ అందరినీ కష్టపడేలా ప్రేరేపించిందని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రమేష్ తోకల మాట్లాడుతూ, దర్శకుడు ఎం.జె. నాయుడుతో ఉన్న చిన్ననాటి స్నేహం వల్లే ఈ సినిమాకు పని చేయడం జరిగిందని తెలిపారు. రాత్రి వేళల్లో వచ్చే సన్నివేశాల కోసం (Night Visuals) ఎంతో శ్రమించామని, దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా విజువల్స్ కోసం పడిన తపన తెరపై స్పష్టంగా కనిపిస్తుందని, ప్రేక్షకులు వెండితెరపై దీనిని ఖచ్చితంగా ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో విహాన్ కార్తీక్ (అనిరుధ్) సరసన దివ్య విశ్వకర్మ హీరోయిన్గా నటిస్తుండగా, కల్పలత, సుమన్ శెట్టి, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్య రాధాకృష్ణ సంగీతం అందించగా, రమేష్ తోకల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. అలరాజు, మోనికా తిరుమణ్యం పాటలు రాయగా, కొక్కుల ప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

