టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో యువ హీరో సంతోష్ శోభన్ చేస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రానికి మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు గతంలో తెరపైకి రాగా… తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు డైరెక్టర్ మారుతి అండ్ టీం ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు.
మెహరీన్ కౌర్, సంతోష్ శోభన్ కూల్ అండ్ వైబ్రాంట్ లుక్ లో మెరిసిపోతున్నారు. ఆసక్తికర విషయమేంటంటే ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని తొలువ ఓటీటీలోనే విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?