Bimbisara Director Remuneration | ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ‘బింబిసార’ ఒకటి. చాలా కాలం తర్వాత కళ్యాణ్‌రామ్‌కు ఈ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. బింబిసారుడిగా కళ్యాణ్‌రామ్ నటనకు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కాయో, దర్శకుడు మల్లిడి వశిష్టకు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చాయి. డెబ్యూ సినిమానే అయిన వశిష్ట టేకింగ్‌కు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమాకు వశిష్ట ఎంత పారితోషికం తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
బింబిసార చిత్రానికి దర్శకుడు మల్లిడి వశిష్ట నెలవారీ జీతంగా తీసుకున్నాడట. కాగా సినిమా విడుదలై మంచి వసూళ్ళు సాధించడంతో ఈయనకు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ దక్కిందట. ప్రస్తుతం వశిష్ట బింబిసార-2 స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 35 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఫుల్‌రన్ ముగిసే సరికి 40కోట్ల షేర్‌ను సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా కూడా బింబిసార నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్లో కళ్యాణ్‌రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది.