మహేశ్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’. సత్య చౌదరి నిర్మాత. సోనియా నాయుడు, పూజారెడ్డి కథానాయికలు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మహిళాప్రధాన చిత్రంలో అద్భుతమైన సందేశం కూడా ఉంటుందని, తొలి ప్రయత్నంలోనే ఇద్దరు కథానాయికల్ని పరిచయం చేయడం ఆనందంగా ఉందని నిర్మాత సత్య చౌదరి అన్నారు. దిశ ఘటనతోపాటు కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొంది, ఈ కథ రాసుకున్నానని దర్శకుడు మహేశ్ కాంపెల్లి తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోయిన్లు సోనియా నాయుడు, పూజారెడ్డి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా అన్విధ్, సాగర్, సమీర్, రంగారావు చౌదరి, ముసా అలీఖాన్ కూడా మాట్లాడారు.