జి.వి.నాయుడు దర్శకునిగా పరిచయం అవుతూ వి.జె.బాలు, లావణ్య, కల్యాణి రాణిలతో కలిసి నటించిన విభిన్న కథాచిత్రం ‘క్యాట్’. రజనీ గొంగటి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
థ్రిల్లర్ జోనర్లో సాగే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: శేఖర్ ముద్దు, కెమెరా: పంకజ్ తొట్టాడ, సంగీతం: మారుతిరాజా, సమర్పణ: వై.గంగాధర్, నిర్మాణం: వీఆర్‌జీఆర్ మూవీస్.