యామిని రాజ్, కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్ నిమ్మల దర్శకుడు. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్ నిర్మాతలు. మోషన్‌పోస్టర్‌ను ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘టైటిల్‌కు తగ్గట్లే ఇదొక యూత్‌ఫుల్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సందీప్, రాజారెడ్డి, పవన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ.