అభిమన్యు, నిఖిల్ కుమార్, పిఫా ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతికిరణ్ నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాకిస్థాన్ బోర్డర్లో ఎంతో రిస్క్ చేసి చిత్రీకరణ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా వుంటుంది’ అన్నారు.