Dilraju Next Tamil Movie | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తూ.. స్టార్ ప్రొడ్యూసర్‌గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన కన్ను తమిళ ఇండస్ట్రీపై పడింది. తెలుగుతో పాటు తమిళంలోనూ తన ప్రొడక్షన్ మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా తమిళ హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన విజయ్‌తో చేసిన వారసుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా పెద్ద ఎత్తున ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీనితో పాటు తమిళ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ15 చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో దిల్‌రాజు రూపొందిస్తున్నాడు.
తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ మరో తమిళ హీరోను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. కాగా దిల్‌రాజు తమిళ హీరో ధనుష్‌తో ఓ సినిమాను ప్లాన్ చేశాడట. శ్రీకారం ఫేం కిషోర్ రెడ్డి ఇటీవలే ధనుష్‌కు సరిపడ కథను సిద్ధం చేసి, ఆయనకు నెరేట్ చేశాడట. ధనుష్‌కు కూడా కథ బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే ‘వారిసు’ తర్వాత దిల్‌రాజు చేస్తున్న తమిళ సినిమా ఇదే. ఇక ధనుష్ కూడా ఇప్పటికే వెంకీ అట్లూరితో ‘సార్’, శేఖర్ కమ్ములాతో ఓ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. కాగా తమిళ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో మంచి పేరున్న బ్యానర్లో సినిమా చేస్తే టాలీవుడ్లో మంచి మార్కెట్ పెంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు.