Selfish | సెల్ఫిష్ నుంచి దిల్ కుష్ లిరికల్ వీడియో సాంగ్
Selfish | ఆశిష్ రెడ్డి ( Ashish reddy) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సెల్ఫిష్’ (Selfish). మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి దిల్కుష్ లిరికల్ వీడియో సాంగ్ (DilKush Lyrical Song) ను మేకర్స్ లాంఛ్ చేశారు.
Selfish | రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి ( Ashish reddy ). ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సెల్ఫిష్’ (Selfish). కాశీ విశాల్ (Kasi Vishal) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి దిల్కుష్ లిరికల్ వీడియో సాంగ్‌ను స్పెషల్ ఈవెంట్లో లాంఛ్ చేశారు.
మేరా దిల్ కుష్ హువా.. తుజ్ సే ప్యార్ హువా.. (DilKush Lyrical Song) అంటూ ప్రేయసి మాయలో పడ్డ హీరో పాడుకుంటున్న ఈ పాట తెలుగు, హిందీ లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తోంది.
ఆశిష్ రెడ్డికి ఇది రెండో సినిమా. కాగా ఇప్పటివరకు విడుదలైన లుక్స్ యూత్‌ను ఆకట్టుకుంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో ఆశిష్ రెడ్డి స్టైలిష్ గల్లీ బాయ్ లుక్స్ తో అదరగొట్టబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్లతో తెలిసిపోతుంది.
దిల్ కుష్ లిరికల్ వీడియో సాంగ్..
బల్లె బల్లె ఝలక్ నీదే బాలిక..
నీ వంద కోట్ల అందమంతా నాదిక ❤️#Selfish Dil Ka First Beat 🤩#DilKush Lyrical Song Out Now 🎶▶️ https://t.co/3GmwYVjeBV@AshishVoffl @_Ivana_official @aryasukku #DilRaju #KasiVishal @MickeyJMeyer @SVC_official @adityamusic @ramjowrites pic.twitter.com/BkUqLDLgIC
— Sukumar Writings (@SukumarWritings) May 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

