Ram Charan | రామ్ చరణ్ బర్త్‌డే.. నేడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్న దిల్ రాజు
Dil Raju | 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చరణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ 16 ఓకే చేశాడు.
Dil Raju | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చరణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ 16 ఓకే చేశాడు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న చరణ్ తన పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఇప్పటికే అప్డేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలావుంటే.. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నేడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ డ్రైవ్ నిర్వహించబోతుండగా.. ఈ డ్రైవ్‌ను టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రారంభించనున్నాడు.
దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా… బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ లుక్ కు, టైటిల్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
BLOOD DONATION DRIVE Inauguration
Will Be Done By Our #GameChanger Producer #DilRaju Garu
On The Eve Of Our 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 #RamCharan BirthdayAt Chiranjeevi Blood Bank, HYD
On 24th March, 10:00 AM OnwardsOrganised By #TeamRamCharan #HBDRamCharan pic.twitter.com/DhFam7qQ3o
— Team RC Hyderabad (@TeamRCHyd) March 22, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

