‘దిల్‌రాజు ప్రొడక్షన్స్ ద్వారా కొత్త టాలెంట్‌ను, చిన్న చిత్రాలను ప్రోత్సహించాలనుకున్నాం. అలా ‘బలగం’ సినిమా వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో ‘జనక అయితే గనక’ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. రిలీజ్‌కు ముందే ఈ సినిమాను మీడియా వారికి చూపించాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ‘జనక అయితే గనక’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రివ్యూలు చూసిన వారందరూ సినిమా బాగుందని ప్రశంసించారు, విడుదలకు ముందే పాస్ అయ్యామని దిల్ రాజు చెప్పారు. మధ్యతరగతి నేపథ్యంలో చక్కటి హాస్యభరిత చిత్రమిదని దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొంది.