పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ రివైంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. మేఘన కథానాయిక. సూర్య జి.యాదవ్ దర్శకుడు. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ సినిమా నిర్మించామని, అందరికీ నచ్చే ఎంటర్టైనర్ ఇదని హీరో, నిర్మాత పార్థగోపాల్ అన్నారు. కడప జిల్లాలో అరవై లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపామని, ఇదొక విభిన్నమైన కథ అని దర్శకుడు సూర్య.జి యాదవ్ తెలిపారు.