యాక్షన్‌కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రధారులు. అర్జున్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు కన్నడ స్టార్హీరో ధ్రువ సర్జా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. ఆయన ఇందులో ‘పవన్’ అనే ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాలో ధ్రువ సర్జా పోషిస్తున్న ‘పవన్’ పాత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ మెచ్చేలా ఈ పోస్టర్లో ధ్రువ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ధ్రువ సర్జా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జి.బాలమురుగన్, సంగీతం: అనుప్ రూబెన్స్, నిర్మాణం: శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్.