జయా, షబానాతో ధర్మేంద్ర రొమాన్స్.. కరణ్ జోహార్ డైరక్షన్లో కొత్త మూవీ !

ముంబై : అలనాటి బాలీవుడ్ దిగ్గజాలు ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీలు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఓ లవ్‌స్టోరీ సినిమాలో వీళ్లంతా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను కరణ్ జోహార్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను కరణ్ వెల్లడించనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్లు నటిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయిదేళ్ల తర్వాత కరణ్ మళ్లీ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రేమ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధర్మేంద్ర జయా బచ్చన్, షబానీలు ప్రత్యేక పాత్రలు పోషించనున్నారు. కరణ్ తీసే సినిమాలో నటిస్తున్నది నిజమే అంటూ ధర్మేంద్ర ఓ మీడియా సంస్థకు క్లారిటీ ఇచ్చేశారు. కరణ్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహాంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పేశారు.
ఒకప్పుడు బాలీవుడ్ హీమ్యాన్‌గా పేరుగాలించిన ధర్మేంద్ర ఈ సినిమాలో రొమాంటిక్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఆయన్ను చూడనున్నామని కొందరు అంటున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో కరణ్ వెల్లడించాడు. ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో కరణ్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రణ్‌వీర్‌సింగ్ బర్త్‌డే కావడం కూడా విశేషం. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

