విజయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన పొయెటిక్ ప్రేమకథ ‘కాలమేగా కరిగింది.’. శింగర మోహన్ దర్శకుడు. మరే శివశంకర్ నిర్మాత. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ‘దరి దాటిన మోహం దేహమే కదా.. ఎదుటే నిలిచేనూ.. ఆ యదపై తాకెను.. చెలి వీడినా మౌనం.. మర్మమే కదా.. కథలై కదిలెనూ.. ఆ కబురై పాకేనూ..’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు శింగర మోహన్ రాయగా, గుడప్పన్ స్వరపరిచారు. సాయిమాధవ్, ఐశ్వర్య దదూరి ఆలపించారు. యువతరం మెచ్చే ప్రేమకథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి, నిర్మాణం: సింగార క్రియేషన్స్ వర్క్స్.