వన్డే హీరో నువ్వే ఫ్రెండూ.. నీ కోసమే డబుల్ సౌండూ..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న బహుభాషా చిత్రం ‘కుబేర’. అగ్రనటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు నిర్మాతలు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న బహుభాషా చిత్రం ‘కుబేర’. అగ్రనటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు నిర్మాతలు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘పోయిరా పోయిరా పోయిరా.. పోయిరా మామా..’ అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాయగా, దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. తమిళంతో పాటు తెలుగులో కూడా హీరో ధనుష్ స్వయంగా ఈ పాట పాడటం విశేషం.
అతని గాత్రంలోని మాగ్నెటిక్ ఫోర్స్ పాటను మరోస్థాయికి తీసుకెళ్లిందని, శేఖర్ వి.జె కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోసిందని మేకర్స్ చెబుతున్నారు. ‘వన్డే హీరో నువ్వే ఫ్రెండూ.. నీ కోసమే డబుల్ సౌండూ.. అస్సల్ తగ్గక్ అట్నే ఉండూ.. మొక్కుతారూ కాళ్లు రెండూ..’ అంటూ హీరో నైజాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. పెళ్లి ఊరేగింపులో ధనుష్ ఆడిపాడుతూ ఈ పాటలో కనిపిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జిమ్ సార్భ్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

