Ms Shetty Mr Polishetty Movie | ‘జాతిరత్నాలు’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఇంకా ఇప్పటివరకు తన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే రొమ్-కామ్ సినిమా చేస్తున్నాడు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. పైగా దానికి తోడు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తున్నారు.
కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ను ప్రకటించింది. హతవిది అంటూ సాగే పాటను మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రధన్ స్వర పరిచిన ఈ పాటను తమిళ హీరో ధనుష్ ఆలపించాడు. ఇదే విషయాన్ని చెబుతూ చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నవీన్ చేసిన ఫన్నీ అంతా ఇంతా కాదు. ఇలా పాటకు ప్రమోషన్లు చేస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్‌కు జోడీగా అనుష్క నటిస్తుంది. యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.