Tamil Heroes | నిన్న మొన్నటి వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన తమిళ హీరోలు.. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు చాలా మంది హీరోలు నేరుగా టాలీవుడ్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. పైగా వాళ్లకు తోడుగా తెలుగు దర్శకులు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. వరుసగా తమిళ హీరోలతో మన దర్శకులు సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమా గురించి ఇంతవరకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. అంతలోనే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు ధనుష్.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు ధనుష్ హీరోగా సార్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మించబోతోంది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాకు మరో నిర్మాత కావడం గమనార్హం.
కేవలం ధనుష్ మాత్రమే కాదు శివ కార్తికేయన్ కూడా త్వరలోనే తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు శివ కార్తికేయన్. విజయ్, వంశీ పైడిపల్లి సినిమా కూడా 2023లో విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన హీరోలు కూడా తక్కువ తినలేదు. నేరుగా తమిళ ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అల్లు అర్జున్ పుష్ప కలెక్షన్స్.. ఆరు రోజుల్లో ఎంత వచ్చాయంటే..
ట్రిపుల్ ఆర్ సాంగ్ ప్రోమో.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొమరం భీమ్..
ఏపీ సర్కార్ నిర్ణయంతో బెంబేలెత్తిపోతున్న థియేటర్ల యాజమాన్యాలు.. 50 సినిమా హాల్స్ క్లోజ్
తెలుగు సినిమా మొదలుపెట్టిన తమిళ స్టార్ హీరో