ఏపీ సర్కార్ నిర్ణయంతో బెంబేలెత్తిపోతున్న థియేటర్ల యాజమాన్యాలు.. 50 సినిమా హాల్స్ క్లోజ్

AP cinema Theaters | ఏపీలో కొన్నాళ్లుగా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్స్ తెరుచుకోమని చెప్పారు కానీ మరీ దారుణంగా 5 రూపాయల టికెట్ పెట్టారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియక తికమక పడుతున్నారు థియేటర్ ఓనర్స్. ఇక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్లేం చెప్పాలో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయారు. కరవబోతే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు మారిపోయింది ఇప్పుడు అక్కడ పరిస్థితి. గవర్నమెంట్‌కు ఎదురెళ్లలేరు.. అలాగని ఉన్న టికెట్ రేట్లతో థియేటర్స్ నడపలేరు. అందుకే నాని లాంటి హీరోలు ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు.
10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్స్ ఆదాయం కంటే.. పక్కనే ఉన్న కిరాణ కొట్టు కౌంటర్ ఎక్కువగా నడుస్తుంటే అంతకంటే ప్రేక్షకులకు అవమానం మరోటి లేదని చెప్పాడు నాని. దాన్నిబట్టి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న టికెట్ రేట్లతో థియేటర్స్ యాజమాన్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినా కూడా బాగా తగ్గించేసిన ధరల మూలాన.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా కలెక్షన్స్ రావడం లేదు. అఖండ అంత పెద్ద విజయం సాధించినా కూడా ఏపీలో కొన్నిచోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా మరో షాకింగ్ ఘటన కూడా చోటు చేసుకుంది.
గోదావరి జిల్లాల్లో ఏకంగా 50 థియేటర్స్‌ను కొన్నాళ్లపాటు స్వచ్ఛందంగా మూసివేస్తున్నామని ఆయా థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో థియేటర్స్ నడపలేమంటూ చేతులెత్తేశారు. ఈ ధరలు ఉంటే వర్కవుట్ అవ్వదని ముందుగానే థియేటర్లను మూసివేస్తున్నామని చెప్పారు. పైగా ఈ మధ్యే ఏపీలో 10 థియేటర్స్ సీజ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అఖండ 3 వీక్స్ కలెక్షన్స్.. అమ్మింది ఎంత.. వచ్చింది ఎంత..?
ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..
రీ ఎంట్రీతో రచ్చ చేస్తున్న సీనియర్ యాంకర్..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బాలకృష్ణతో విజయశాంతి?
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

