రీ ఎంట్రీతో రచ్చ చేస్తున్న సీనియర్ యాంకర్..

Udayabhanu | యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే. బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఉదయభాను. కానీ ఉన్నట్టుండి సడెన్‌గా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. పెళ్లయ్యాక ఇండస్ట్రీకి దూరమైన ఉదయభాను.. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఉదయభాను.. ఇప్పుడు వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతుంది. ఉదయభాను స్లో అయిన తర్వాతే యాంకర్ సుమ టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఉదయభాను కనిపించింది. ఈ మధ్య మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తుంది ఉదయభాను. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో మొన్న రిలీజైన బాలయ్య అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈమె సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే బిజీ అవుతుందని అంటున్నారు ఉదయభాను అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
రూ.14 కోట్ల లాభాలు వచ్చినా.. అఖండ అక్కడ ఇంకా సేఫ్ అవ్వలేదుగా..
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
Radhe shyam pre release event | ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారిన యంగ్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor
- Tollywood
- udaya bhanu
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

