Akhanda movie collections | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా వచ్చి అప్పుడే మూడు వారాలు పూర్తయిపోయింది. అయినా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. రెండో వారం తర్వాత పుష్ప వచ్చినా.. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన 21వ రోజు కూడా 30 లక్షల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత సత్తా చూపిస్తున్నాడు. మూడో వీకెండ్ దాదాపు 4 కోట్ల వరకు వసూలు చేసింది అఖండ. అలాగే మూడు వారాలు పూర్తయిపోయిన తర్వాత ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలి అనే లెక్కలు బయటికి వచ్చాయి. డిసెంబర్ 17న పుష్ప వచ్చాక కూడా వీకెండ్ సత్తా చూపించాడు అఖండ. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు అఖండ. ఓసారి 3 వీక్స్ కలెక్షన్స్ చూద్దాం..
ఏరియా | వచ్చింది | అమ్మింది |
నైజాం | 19.23 కోట్లు | 10.5 కోట్లు |
సీడెడ్ | 14.62 కోట్లు | 10.6 కోట్లు |
ఉత్తరాంధ్ర | 5.95 కోట్లు | 6 కోట్లు |
ఈస్ట్ | 4.00 కోట్లు | 4.00 కోట్లు |
వెస్ట్ | 3.88 కోట్లు | 3.5 కోట్లు |
గుంటూరు | 4.56 కోట్లు | 5.4 కోట్లు |
కృష్ణా | 3.46 కోట్లు | 3.7 కోట్లు |
నెల్లూరు | 2.51 కోట్లు | 1.8 కోట్లు |
ఏపీ-తెలంగాణ టోటల్: 58.21 కోట్లు / 45.50
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 10.47 కోట్లు / 7.5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 21 డేస్ కలెక్షన్స్: 68.68 కోట్లు షేర్ / 53 కోట్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Bala Krishna: మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమని చెప్పిన బాలకృష్ణ
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Akhanda: విజయోత్సవ వేడుకలో సాష్టాంగ నమస్కారం చేసి ఆశ్చర్యపరచిన హీరోయిన్