Dhanush Son Debut | తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా నటిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ విలక్షణ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. అయితే, ధనుష్ త్వరలోనే ఓ సరికొత్త సాహసానికి తెరలేపబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తన పెద్ద కుమారుడు యాత్రను వెండితెరకు హీరోగా పరిచయం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేయనుండటం విశేషం. ‘ఆర్‌టేక్ స్టూడియోస్’, ధనుష్ సొంత నిర్మాణ సంస్థ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’ సంయుక్తంగా ఈ క్రేజీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యాత్ర యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటుండగా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నారు. ధనుష్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతుండగా, వేల్రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. తండ్రి దర్శకత్వంలో కొడుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.