Rayan Trailer | సింహాలను సైతం మట్టి కరిపించే తోడేళ్లు.. ఆసక్తికరంగా రాయన్ ట్రైలర్
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాయన్'. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రధారులు.
Rayan Trailer | ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాయన్’. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రధారులు. ఈనెల 26న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది.
కానీ.. తోడేలు చాలా జిత్తులమారిది.. గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి..’ అనే పవర్ఫుల్ వాయిస్ ఇంట్రోతో ఈ ట్రైలర్ మొదలైంది. సినిమా ఆద్యంతం యాక్షన్ ప్యాక్ట్ ఎలిమెంట్స్‌తో సాగుతుందని ట్రైలర్ చెబుతున్నది. ధనుష్‌తోపాటు సందీప్‌కిషన్, ఎస్.జె.సూర్య, ప్రకాశ్‌రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ స్వరాలందించిన ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

