Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి కుబేర (Kubera). టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నాడు. D51గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కో రోల్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
కొన్ని రోజులుగా ధనుష్ అండ్ నాగార్జున, రష్మిక టీం ముంబై షెడ్యూల్లో పాల్గొంది. జుహూ బీచ్‌లో ధనుష్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రయూనిట్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఇక షూటింగ్ పూర్తయ్యాక ముంబై ఎయిర్‌పోర్టు నుంచి తిరిగొస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ షెడ్యూల్లో ధనుష్, రష్మిక మందన్నాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించగా.. ఇటీవలే హైదరాబాద్‌లో ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్.
ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ కుబేర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో రాయన్‌లో కూడా నటిస్తున్నాడు.
Kollywood Superstar #dhanush papped at Mumbai Airport ✈️ after finished shoot of his upcoming film #kubera #Raayan@dhanushkraja #Mumbai pic.twitter.com/H56lpEfYhR
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) June 26, 2024
Following #Nagarjuna, #Dhanush is facing criticism as his bodyguards push away fans. Watch
In a recent interview with a portal, the celebrity paparazzo claimed that South Indian stars are actually fake, and their humility is just for the cameras. pic.twitter.com/DCtfLPJeFC
— ETimes (@etimes) June 26, 2024
Dhanush And Rashmika Spotted At Cotton green in Mumbai.😊
While Shooting For Movie Kubera.#Kubera #Dhanush #RashmikaMandanna pic.twitter.com/yTwY4jZ1R9
— Rakteb Cinephile (@RaktebCinephile) June 26, 2024
South Superstar #Dhanush rocks a casual look as he gets clicked at the airport ❤️✈️ #Kubera look 🔥🔥🔥🔥🔥 #Raayan pic.twitter.com/WgHszN1y2J
— smritigit Paul (@smritigit_pal) June 26, 2024