Captain Miller | కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను జూన్ 30న లాంఛ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాదు కెప్టెన్ మిల్లర్ నుంచి తొలి సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
రాకీ, సాని కాయిధమ్ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రం కెప్టెన్ మిల్లర్ మూడు పార్టులుగా రానుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.