Dhanush 51 Movie | కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘డీ51’గా వస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమాలో నాగార్జున మీద వచ్చే కొన్ని ప్రధాన సన్నివేశాలు సన్నివేశాలను హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల నుండి చంచల్ గూడా జైలులో అవుతుందని.. మరో రెండు రోజులు అక్కడే జరుగుతుందని కూడా తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున నటించడం ఇదే మొదటిసారి.
ఓ యథార్థ సంఘటన ఆధారంగా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. మరోవైపు నాగార్జున తాజాగా నటించిన ‘నా సామి రంగా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.