Dhamaka Movie Hindi Dubbing Rights | మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం ఒక మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామా రావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ కాస్త నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ధమాకా హిందీ డబ్బింగ్ హక్కులు భారీ ధరకు అమ్మడయ్యాయట.
ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయట. రవితేజ హిందీ మార్కెట్‌కు ఇది చాలా ఎక్కువ. ఇటీవలే రవితేజ నటించిన ఖిలాడీ మూవీ హిందీలో కోటీ రూపాయలను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.20కోట్లకు అమ్ముడవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ సంస్థలు నిర్మించనుడంతో హిందీ డబ్బింగ్ హక్కులకు అంత రేటు పలికాయట. ఈ ఏడాది ఈ బ్యానర్లలో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలను కొన్ని హిందీ డిస్ట్రిబ్యూటర్లు మూడు, నాలుగింతల లాభాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో ధమాకా సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందనే ధీమాతోనే ఆ స్థాయిలో హిందీ బిజినెస్ జరిగిందట.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందింది. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చాడు.