Dhamaka Movie Collections | ఎట్టకేలకు రవితేజ ఈ ఏడాది హిట్టు కొట్టాడు. ‘ధమాకా’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపిస్తున్నాడు. ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లతో పట్టుకోల్పోయిన తన మార్కెట్‌ను ధమాకాతో మళ్లీ పుంజుకునేలా చేశాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ పెరుగుతూనే ఉంది. మొదటి రోజుకు మించి మూడో రోజు కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది.
మొదటి రోజు రూ.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం మూడో రోజు రూ.13 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.15.37 కోట్లు కలెక్ట్ చేసింది. మరో మూడున్నర కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పుడున్న జోష్ చూస్తుంటే సోమవారంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కాయంగా కనిపిస్తుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ తర్వాత ఈ సినిమా భారీ విజయం సాధించడంతో రవితేజ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. క్రాక్ తర్వాత రవితేజ నుండి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడు. శ్రీలీల తన నటనతో మరో మెట్టు ఎక్కేసింది. భీమ్స్ సిసిరోలియో తన బాణీలతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వలేదు. పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు.
Day 3️⃣ of #Dhamaka
Bigger
&
Unanimous than Day 1️⃣💥watch #DhamakaBlockbuster 💥
Book your 🎫 👇https://t.co/iZ40p9utmY@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/VPfwbqtt4J
— People Media Factory (@peoplemediafcy) December 26, 2022